ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 62 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. కర్నూలులో అత్యథికంగా 27 కొత్త కేసులు , కృష్ణా నుంచి 14, గుంటూరు నుంచి 11 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.ఇక దేశవ్యాప్తంగా  గడిచిన 24 గంటల్లో  వివిధ రాష్ట్రాల్లో 1684 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా 37 మంది చనిపోయారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 718 కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23వేలు దాటింది.